ప్రకృతి ప్రసాదించిన అనేక రకాల ఆహారాల్లో కొన్ని అతి బలమైన ఆహారాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో వాల్‌నట్స్ ఒకటి..ఈరోజు వీటి కంటే..బలమైన నట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వీటిపేరు పీకాన్‌నట్స్( pikanuts). ఇవి కూడా చూడ్డానికి బ్రెయిన్ షేప్‌లో ఉంటాయి. విత్తనాల్లోనే అతి బలమైన విత్తనాలు ఇవి.
2017వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ కాంపినాస్ బ్రెజిల్( University Of Campinas Brazil-2017) సెంటిస్టులు ఈ నట్స్‌మీద పరిశోధన చేసి..ప్రధానంగా 5 లాభాలు ఈ నట్స్ వల్ల ఉంటున్నాయని కనుగొన్నారు. అవేంటంటే..
బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచే శక్తి ఈ నట్స్‌లో ఉంది.
మగవారికి. ప్రోస్టేడ్ క్యాన్సర్ రాకుండా ఇది రక్షిస్తుంది.
ఈ నట్స్ పిల్లలకు పెడితే..బ్రెయిన్ డెవల్పమెంట్‌కి బాగా ఉపయోగపడుతుంది.
యాంటీ ఇన్ఫమెంటరీగాగా ఇమ్యూనిటీ బూస్టర్‌లాగా ఇది బాగా పనికొస్తుందట.
హెయిర్ రూట్స్‌కి బ్లడ్ సప్లైయ్‌ను బాగా పెంచి..హెయిర్ ఎదగడానికి, జుట్టు ఊడకుండా బలంగా ఉండటానికి అద్భుతంగా ఈ నట్స్ పనికొస్తాయి.
దీని ధర కాస్త ఖరీదైనదే. 2100వరకూ ఉంటుంది. ఫలితం కూడా ఎక్కువే ఉంది.
100 గ్రాముల పీకాన్‌నట్స్‌లో ఉండే పోషకాలు
కాలరీలో 691..కేజీ చేపలు తిన్నా..ఇవి 100గ్రాములు తిన్నా సమానమే. కోడిమాంసం కంటే..ఏడు రెట్లు బలం ఎక్కువ..
- కార్భోహైడ్రేట్స్ 14గ్రాములు
- ప్రోటీన్స్ 9 గ్రాములు
- కొవ్వు 72 గ్రాములు
- ఫైబర్ 10 గ్రాములు
ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి..ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంది అనుకుంటున్నారేమో..ఇవి చాలా మంచి కొవ్వులు..నాచురల్ ఫ్యాట్. మన బ్రెయిన్ అంతా ఫ్యాటే కదా…మెదడుకు చాలా అవసరం ఇది.
ఏ ఫ్యాట్ దేనికి ఉపయోగం:
- సాట్చూరేటెడ్ ఫ్యాట్ 6 శాతం
- మోనో అన్‌సాట్చురేటెడ్ ఫ్యాట్ 40 గ్రాములు
పాలీ అన్ సాట్చూరేటెడ్ ఫ్యాట్ 21 గ్రాములు..ఆరోగ్యానికి మోనో, పాలీ ఫ్యాట్స్ చాలా మంచిది. గుండె ఆరోగ్యానికి ఈ రెండు ఫ్యాట్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో ప్రమాదానికి కారణం అయ్యే రక్తనాళాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తనాళాలను మూసివేయటం జరిగి..దీని ద్వారా గుండెపోటు వస్తుంది. ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించి..గుడ్ కొలెస్ట్రాల్ ఈ నట్స్ పెంచుతుంది….ఈ నట్స్ వల్ల..పాలీ అన్ సాట్చూరేటెడ్ ఫ్యాట్‌తో పాటు బీటాసైటోస్టిరాల్ ఫ్యాట్ కాంబీనేషన్ ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తుందని సైంటిస్టులు నిరూపించారు.
ఈ బీటాసైటోస్టిరాల్ ఉండటం వల్ల..మగవారిలో..ప్రోస్టెడ్ ఎన్‌లార్జమెంట్ రాకుండా కంట్రోల్ చేస్తుందని అధ్యయనంలో తేలింది.
మోనో అన్ సాట్చురేటెడ్ ఫ్యాట్ చిన్నపిల్లలకు మెమరీకి, మోటార్ స్కిల్ డవలమ్మెంట్‌కి బాగా ఉపయోగపడుతుంది.
ఈ నట్స్‌లో 120 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది..ఇది యాంటి ఇన్ఫ్లమెంటరీ ప్రాపర్టీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హై లెవల్లో ఉండటం వల్ల ఇమ్యునిటీ బూస్టింగ్‌కి బాగా పనికొస్తుంది.
ఈ నట్స్‌లో ఎల్ ఆర్జిన్ అనే.. ఎమైనా ఆర్జిన్ ఉండటం వల్ల..హెయిర్ రూట్స్‌కి బ్లడ్ సప్లైయ్‌ని బాగా పెంచుతుందట. దాని ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.
ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల..డైరెక్టుగా తింటే వెగుటుగా ఉంటుంది..నానపెట్టుకుని తింటే..చాలా ఈజీగా తినొచ్చు. రోజుకు 5-10 నట్స్‌ని నీళ్లలో వేసుకుని నానపెట్టుకుని తింటేసరి. స్ప్రౌట్స్‌తో, ఫ్రూట్స్‌తో తినొచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి కొనగలిగితే..మీరు వీటిని ట్రై చేయండి.
-Triveni Buskarowthu