జబర్థస్త్ బ్యూటీ అనసూయ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో ఈ బుల్లి తెర యాంకర్ డ్యుయల్ రోల్ లో కనిపించనుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టిన అనసూయకు ఆ తరువాత నుంచి వరసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తోంది. దీంట్లో బ్రహ్మన యువతి పాత్రతో పాటు మరో రోల్ లో నటిస్తోంది. ఇందులో ఓ క్యారెక్టర్ మధ్యలోనే చనిపోతుండగా.. మరో రోల్ సినిమా చివరి వరకు ఉంటుందని టాక్.
ఇటీవల పుష్ప సినిమాలో అనసూయ చేసిన ద్రాక్షాయణి క్యారెక్టర్ కు చాలా మంచి పేరు వచ్చింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అనసూయ కనిపించింది. పుష్ప సినిమా తొలిభాగంలో పెద్దగా యాక్టింగ్ స్కోప్ దొరకలేదు. అయితే రెండో భాగంలో మాత్రం ద్రాక్షాయణి క్యారెక్టర్ లెన్త్ ఎక్కువగానే ఉండనుందట. ఓ వైపు బుల్లితెరపై మరో వైపు బిగ్ స్క్రీన్ పై ఇలా రెండింటిలోనూ బిజీ అవుతోంది అనసూయ.