తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ ఎంత వరకు కష్టపడ్డారు ఏంటనే దానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నారా లోకేష్ ప్రజల్లో పార్టీని ముందుకు నడిపించే విషయంలో విఫలమవుతున్నారు.
అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో నారా లోకేష్ సమర్థత పెద్దగా కనబడటం లేదు అనే భావన టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లి కార్యకర్తలను ముందుకు నడిపించలేకపోతున్నారు. నాయకుల్లో కూడా ఆయన ధైర్యం కల్పించలేకపోతున్నారు అని ఆవేదన ఉంది. అయితే గతంలో కంటే ఇప్పుడు నారా లోకేష్ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ తరుణంలో నారా లోకేష్ చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది అనేది టిడిపి నేతల అభిప్రాయం. ఇప్పటివరకు కూడా పార్టీలో ఉన్న వర్గ విభేదాలు నారా లోకేష్ పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తో నారా లోకేష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే పార్టీలో ఇబ్బందులు రావచ్చు. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పార్టీకి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ నేతలతో కూడా లోకేష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది.