రాష్ట్రంలో మావోల ప్రభావం దాదాపుగా తగ్గనప్పటికీ ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో అడపాదడపా మావోయిస్టుల ఉనికి భయటపడుతోంది. తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అటవీపరిధిలోని కాల్వపల్లి ప్రాంతంలో మావోయిస్ట్ లకు చెందిన డంప్ భయటపడింది. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ఏరియాల్లో ముమ్మరంగా గాలింపు చేపడుతన్నారు. ఇలా గాలింపు చేపట్టే క్రమంలో తాడ్వాయి ప్రాంతంలో డంప్ బయటపడింది. ఘటన జరిగి ఒకటి రెండు రోజుల తర్వాత పోలీసులు నిర్ధారించారు. తాజాగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వివరాలను వెల్లడించారు. ములుగు ఏజెన్సీ పరిధిలోని తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు, ఏటూర్ నాగారం ప్రాంతంలో మావోయిస్ట్ ల ఉనికి ఎక్కువగా ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను పట్టుకోవడం, మావోయిస్ట్ సానుభూతిపరులను అరెస్ట్ చేయడం వంటి సంఘటను జరిగాయి. వీరితో పాటు షెల్టర్ కోసం ఛత్తీస్గడ్ నుంచి వచ్చే మావోయిస్ట్ లకు కూడా ములుగు జిల్లా సేఫ్ ప్లేస్ గా ఉండేది. ఈక్రమంలోనే గతంలో ఇలా వచ్చిన మావోలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి.