మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చత్తీస్గడ్ బస్తర్ రీజియన్ మాడ్ అటవీ ప్రాంతంలో మరణించినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీతో పాటు బస్తర్ ఎస్పీ ధ్రువీకరించారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట. గత నాలుగు దశాబ్ధాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ఆర్కే మావోయిస్టు పార్టీ టాప్ 3 నాయకుల్లో ఒకరు. మావోయిస్టు అగ్రనేతల్లో గణపతి, కిషన్ జీ తరువాత ఆర్కే ముఖ్యస్థానంలో ఉన్నారు. అలిపిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన నక్సల్ దాడిలో ఆర్కే ప్రమేయం ఉంది.
మావోయిస్టు పార్టీ ఎదురు దెబ్బ… కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే మరణం
-