మావోయిస్టుల ట్రాప్.. ఐఈడీ పేలి ఇద్దరు చిన్నారులు దుర్మరణం

-

భద్రతా బలగాల కోసం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు చిన్నారులు స్పాట్ లోనే మృతి చెందారు. చిన్నారుల తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

అనుకోకుండా ఐఈడీ అమర్చిన ప్రాంతంలోకి ఓ తల్లి తన చిన్నారులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులు ఆ మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సుక్మా జిల్లా గోగుండా‌కొండపై ఉపంపల్లి ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు మొత్తం 17 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news