ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గత కొంతకాలంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే, మృతులు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరి మరణానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల వివరాలపై ఆరా తీసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.ఆర్థిక ఇబ్బందులే వీరి మృతికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.