పక్షిలాంటి డ్రోన్… అన్నల గుండెల్ల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది …!

-

ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఓడిస్సా పోలీసులు, ప్రత్యేక బలగాలు ఇప్పుడు మావోయిస్ట్ లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడికక్కడ మావోలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని సేకరిస్తూ, నిఘా వర్గాల సహకారం తీసుకుంటూ పోలీసులు చెలరేగిపోతున్నారు. ఎక్కడిక్కడ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వాటికి ప్రత్యేక పేర్లు పెడుతున్నారు. పహార్, జంతర్ అంటూ ప్రత్యేక పేర్లు పెట్టి ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.

తాజాగా పహార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో పోలీసులు మావోలను కాల్చి చంపారు. దాదాపు పది మవోలను కాల్చి చంపారు పోలీసులు. సుమారు 30 గంటల నుంచి ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని తొండమార్కా, దుర్మా, జడేకదేవాల్‌ అటవీప్రాంతంలో భద్రతాబలగాలు 30గంటలపాటు ఆపరేషన్‌ ప్రహార్‌ నిర్వహించారు. పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఓడిస్సాలోని మల్కాన్ గిరి సహా పలు జిల్లాలు ఆంధ్రా సరిహద్దుని పంచుకుంటున్నాయి. ప్రస్తుతం ఆకులు రాలుతున్నాయి చెట్లకు. దీనితో మావోల ఉనికిని డ్రోన్ ద్వారా పసిగడుతున్నారు. వారి కార్యాకలాపాల కోసం చిన్న చిన్న డ్రోన్ లను, పక్షి రూపంలో ఉండే డ్రోన్ లను వినియోగిస్తున్నారు. దీనితో దట్టమైన అటవీ ప్రాంతాలకు మావోలు వెళ్ళిపోతున్నారు. దీనితో అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.

మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలీ, చత్తీస్గఢ్ లో దంతేవాడ, బీజాపూర్ ఇలా అనేక ప్రాంతాల్లో ప్రత్యేక కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోకి విస్తరించాలని భావిస్తున్న మావోలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ఆపరేషన్లు అనేవి చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి. పచ్చగా ఉండే అబూజ్ మాడ్ అడవుల్లో కూడా ఈ బలగాలు పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version