దారుణం : నలుగురిని గొంతు కోసి చంపిన మావోలు

-

చత్తీస్గడ్ బీజా పూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. నలుగురు గిరిజనులను మావోయిస్టులు గొంతు కోసి చంపారు. రెండు రోజుల క్రితం బీజాపూర్‌ జిల్లాలోని మెటాపాల్ , పుసానార్ నుండి 25 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేశారు. రెండు గ్రామాలకు చెందిన 26 మంది గిరిజనులను మావోలు అపహరించారు. అనంతరం ప్రజాకోర్టులో నలుగురు గిరిజనులను మావోయిస్టులు గొంతు కోసి చంపారు.

దీంతో ఆ రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఇక మిగిలిన వారిలో ఐదుగురిని విడుదల చేసిన మావోయిస్టులు 16 మందిని తమ చెరలోనే ఉంచుకున్నారు. ఇన్ఫార్మర్ ల నెపంతోనే వీరిని చంపినట్టు చెబుతున్నారు. అయితే మిగిలిన 16 మంది కూడా వారి చెరలోనే ఉండడంతో టెన్షన్ నెలకొంది. ఇక వీరి కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గంగళూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు బీజాపూర్ ఎస్పి గణేష్ మిశ్రా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version