ఆ ఒక్కటి చేస్తే జగన్ మీద బాబుదే పైచేయి..!

-

తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమ పథకాలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఏడాది కాలంలోనే ప్రజలపై సంక్షేమ వరాలు కురిపించారు. అయితే ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు కూడా జగన్‌పై బాగా పాజిటివ్‌గా ఉన్నారు. జగన్ తమకు డబ్బులు ఇస్తున్నారని సంబరపడుతున్నారు. ఇంకా రాష్ట్రంలో ఎలాంటి పని జరిగిన జరగకపోయినా, ఆదాయం వచ్చే మార్గాలు లేకపోయినా, అప్పులు చేసినా, అక్రమాలు జరుగుతున్నా కూడా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని, కేవలం వారికి డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నట్లు కనిపిస్తోంద‌ని పలువురు విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీకి, ఈ సంక్షేమ పథకాల దెబ్బ గట్టిగానే తగులుతుందని, దాని వల్ల జనాలకు ఇంకా చంద్రబాబు వైపు మ‌న‌స్సు మ‌ళ్ల‌డం లేద‌ని ఎక్కువ మంది విశ్లేష‌కులు చెబుతున్నారు. అలాగే జనం కూడా స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు కూడా పట్టించుకోకుండా కేవలం జగన్‌నే చూస్తున్నారని, దాని వల్ల కూడా టీడీపీ పుంజుకోలేకపోతుందని అంటున్నారు. అయితే చంద్రబాబు, టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, స్థానికంగా ఉండే సమస్యలని హైలైట్ చేస్తే లాభం ఉండే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

వాస్తవానికి చెప్పాలంటే పథకాలు పక్కనబెట్టేస్తే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు అంతా గొప్పగా ఏమి లేదు. పైగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇసుక, మైనింగ్, పలు కాంట్రాక్ట్‌ల్లో వైసీపీ వాళ్ళు గట్టిగానే దోచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక కీలకమైన ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూముల విషయంలో లెక్కలేని ఆరోపణలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది కొత్త నేత‌లు వైసీపీలోకి వ‌చ్చి ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో సగానికి పైగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, వీరు భారీగా అవినీతికి పాల్ప‌డ‌డం వైఎస్సార్‌సీపీకి పెద్ద మైన‌స్‌గా మారింది.

ఇక వీటినే టీడీపీ ముందు ఉంచితే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల అవినీతి హైలెట్ అయ్యి జ‌గ‌న్ ఇమేజ్ వెన‌క్కు వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ యేడాదిన్నర కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదు. కాబట్టి పథకాల వల్ల ప్రజలకు వ‌చ్చే సంక్షేమం శాశ్వ‌త‌మే అని… అభివృద్ధి అంతిమంగా ముఖ్యం అన్న విష‌యంతో పాటు ఆ పథకాల అమ‌లులో ఉన్న లొసుగులని ప్రజలకు వివరిస్తే బాబుకు బెన్‌ఫిట్ ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకుంటే పరిస్థితులు మారుతాయి. అలా కాకుండా బాబు కేవలం మీడియాలో విమర్శలు చేయడానికే పరిమితమైతే జగన్‌పై పైచేయి సాధించడం కష్టమే.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version