మార్చి 22 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ మార్చి – 22 – ఫాల్గుణమాసం – సోమవారం.

 

మేష రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన వృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం పొందుతారు. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. గతంలో ఉన్న ఆరోగ్యాన్ని  తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ప్రయాణ లాభం కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, ఉన్నత కళాశాలల్లో  ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారాలు: ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు.

పరిహారాలు: శివ లింగాష్టకం పారాయణం చేసుకొండి.

 

కర్కాటక రాశి:ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు ఇబ్బందిగా వుంటుంది.తొందరపాటు తనం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రశాంతత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు.అనవసర ఖర్చులు అధికమవుతాయి.

పరిహారాలు: పేద వారికి సహాయం చేయండి. శివారాధన చేయండి.

 

సింహరాశి:ఆనందంగా గడుపుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులకు దూరంగా ఉంటారు. రుణ బాధలు నుంచి విముక్తి పొందుతారు. ధన లాభం కలుగుతుంది. అందరితో సఖ్యతగా ఉంటారు. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. సోదర సోదరీమణులతో ఆనందంగా గడుపుతారు. ఉనత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప అవకాశాలను అందుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు.

పరిహారాలు: శ్రీకామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

కన్యారాశి:పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. విద్యార్థులు సమయస్ఫూర్తితో ఉంటారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి.

పరిహారాలు: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:ఈరోజు మీ లక్ష్యాలను సాధిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఏకువ సమయాన్నీ గడుపుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.  వైవాహికంగా బాగుంటుంది. పార్టీలకు, శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం లేదా ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు.

పరిహారాలు: కవచం పారాయణం చేయండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు సంతోషకరం గా ఉంటుంది !

ఈరోజు సంతోషకరం గా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో, ధైర్యంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విజయం పొందుతారు. నీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పోటీ పరీక్షలో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

 

ధనస్సురాశి:సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు.  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బును ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. చిన్నప్పటి ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. వ్యాపారాలు అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.

పరిహరాలుః ఈరోజు శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

 

మకర రాశి:విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పనిభారం తక్కువ గా ఉంటుంది. మీరు చేపట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తగ్గిపోతాయి. అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః శ్రీశివాభిషేకం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

 

కుంభరాశి:రుణ బాధలు తీరిపోతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అయినవారితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో అనేకరకాల ఇబ్బందుల నుంచి  బయట పడుతారు.  అధిక లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈ రోజు శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ప్రయాణ సౌకర్యం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గృహంలో ఏదో ఒక వేడుకలు జరుపుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version