పౌరషం ఉంటే ఈటలలాగా.. రాఘురామ రాజీనామా చేయాలి : వైసీపీ డిమాండ్

-

తూర్పుగోదావరి జిల్లా : నరసాపురం ఎం.పి. రాఘురామకృష్ణరాజుపై వైసిపి పార్లమెంట్ ఛీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నరసాపురం ఎం.పి.రాఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యమని.. స్పీకర్ ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రాఘురామకృష్ణరాజు స్పీకర్ ను కలిసినంత మాత్రం చేత బర్తరఫ్ నిలిచిపోదని చురకలు అంటించారు. రాఘురామకృష్ణరాజుకు పౌరషం ఉంటే మాజీ మంత్రి ఈటలలాగా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాజీనామా చేసి పోటీ చేస్తే.. రాఘురామకృష్ణరాజుకు డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కారణంగానే రాఘురామకృష్ణరాజుకు ఈ పరిస్థితి ఎదురైందని మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. త్వరలోనే రాఘురామకృష్ణరాజుపై వేటు తప్పదన్నారు. కాగా నిన్న లోక్​సభ స్పీకర్‌ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news