వైరల్‌ వీడియో : వివాహంలో డీజే చిచ్చు.. వరుడిని చితక్కొట్టిన వధువు బంధువులు

-

వివాహంలో డీజే చిచ్చు రేపింది. డీజే వద్దన్నందుకు పెళ్లి మండపంలోనే తన్నుకున్నారు బంధువులు. సూర్యాపేట జిల్లా, ప్రకాశం జిల్లాకు చెందిన వధూవరులకు పెళ్లయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో ఓ జంటకు పెళ్లి జరిగింది. వివాహం అనంతరం అబ్బాయి, అమ్మాయి తరపువాళ్లు ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అయితే పెళ్లికొడుకు బంధువులు డీజేతో ఊరేగింపుగా వెళ్లాలని పట్టుబట్టారు. ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు లేటవుతుందని.. ఊరేగింపునకు అమ్మాయి వాళ్లు ససేమిరా అన్నారు. అక్కడే గొడవ స్టార్టయింది. ఇంకేముందు రెండువర్గాలు చైర్లు విరిగేలా కొట్టుకున్నారు. ఈ ఘర్షణతో పెళ్లి ఇల్లు రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version