ఐసీయూలో బెడ్‌పై పెళ్లి.. విహాహం అయిన రెండు గంటలకే చనిపోయిన…తల్లి..!

-

పెద్దోళ్లు ఎప్పూడు ఒక మాట అంటారు.. నేను చచ్చేలోపు నీ పెళ్లి చూడాలి అని.. మీ ఇంట్లో కూడా ఇలా అనే బామ్మలు, తాతలు ఉండే ఉంటారు కదా..! బీహార్‌లో కూడా ఇలానే ఓ తల్లి కోరుకుంది. బీహార్‌లోని గయాలో ఓ వెరైటీ పెళ్లి జరిగింది. ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయులో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన కొద్ది సేపటికే.. ఆమె మృతి చెందింది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి దృశ్యాలు నిజ జీవితంలో జరగడం చూసి అందరూ కన్నీరు పెట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే

గురువా బ్లాక్‌లోని సేలంపూర్ గ్రామానికి చెందిన విద్యుత్ కుమార్ అంబేద్కర్ ఇంజనీర్ కుమారుడు సుమిత్ గౌరవ్‌తో ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్ అయ్యాడు. చాందిని కుమారి అమ్మాయితో ఈనెల 26న నిశ్చితార్ధం జరిగింది. అమ్మాయి తల్లి ఆరోగ్యం విషమించడంతో నిశ్చితార్థానికి ఒక రోజు ముందు వారిద్దరికీ పెళ్లి చేయాలని ఆమె పట్టుబట్టింది. పరిస్థితి విషమించడంతో పూనమ్ కుమారి వర్మ తన కుటుంబ సభ్యులతో మాట్లాడి చాందిని కుమారి వివాహం ఐసీయూలోనే జరిపించారు.

తల్లి చివరి కోరిక తీర్చడం కోసం ఆసుపత్రిలోని ఐసీయునే వివాహ వేదికగా మార్చడంతో కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సమక్షంలో వధువరులు విద్యుత్‌కుమార్, చాందినికుమారితో దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. ఇక ఐసీయూ బెడ్‌పై మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌తో ఉన్న పూనమ్‌కుమారి కూతురు, అల్లుడిని అలానే చూస్తూ ఉంది. వేదమంత్రాల సాక్షిగా వారిద్దరు ఒకటయ్యారు. ఇంత వరకూ బానే ఉంది.. కానీ పెళ్లైన రెండు గంటలకే..
బాలిక తల్లి చనిపోయింది.. తన తల్లిని కోల్పోయిన చాందినీ కుమారి, తన తల్లి పూనమ్ కుమారి వర్మ మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ANM గా పనిచేస్తున్నారని మరియు కరోనా కాలం నుంచి అనారోగ్యంతో ఉందని చెప్పారు.

చాందిని కుమారికి వచ్చిన పరిస్థితి నిజంగా చాలా దారణం.. పెళ్లైన ఆనందం కొంచెం కూడా లేదు. తల్లిని కోల్పోయిన బాధే ఎక్కవే. ఏ ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version