చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న కొంతమంది సమావేశం పెట్టుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడని, నిజంగా వాక్ స్వాతంత్రం లేకపోతే మీరిలా మీటింగ్ పెట్టుకోగలరా?? అని ఆయన ప్రశ్నించారు. మూడేళ్లుగా అసభ్యకరమైన భాషలో అనేక వేదికలపై నుంచి మాట్లాడుతూనే ఉన్నారుగా అని ఆయన మండిపడ్డారు. జనం జగన్ కు ఓటు వేసి తప్పు చేశారని అచ్చెన్నాయుడు అంటున్నాడని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు టీడీపీ పారిపోయిందని అని ఆయన ప్రశ్నించారు.
పేద వర్గాలకు 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే కమ్యూనిస్టు పార్టీలు. కమ్యూనిస్టులం అని చెప్పుకోవటానికి రామకృష్ణ లాంటి వాళ్ళు సిగ్గు పడాలి. మీ లాంటి నాయకులను చూసి కార్యకర్తలు బాధపడుతూ ఉండి ఉంటారు. చంద్రబాబు ఏ డ్యాన్స్ వేయమంటే ఆ డ్యాన్స్ వేస్తారు సీపీఐ రామకృష్ణ. ఎక్కడ చిందు వేయమంటే అక్కడ వేస్తారు. సీపీఎం నారాయణ, సీపీఐ రామకృష్ణ, వంటి కుహనా మేధావులు అందరూ చంద్రబాబు పక్కన చేరారు. జగన్ పై నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎందుకు మీ అందరికీ భయం??. కలిసి ఎందుకు పోరాటం చేయాలనుకుంటున్నారు??. సోనియా గాంధీతో కుమ్మక్కై మీరందరూ ఎన్ని కుట్రలు చేసినా అన్నీ ఛేదించుకుని వచ్చారు జగన్. మీ ధర్నాలకు వైసీపీ చిన్న కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు. జీతాలు ప్రతి నెలా ఠంచనుగా ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి. జీతాలు రాకపోతే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా??. కోర్టు మొట్టి కాయలు వేసినా జనసేనకు బుద్ధి రావటం లేదు. జగన్ ను తిట్టడానికి ప్రతి ఆదివారం ఒక అడ్డ గాడిద వస్తోంది. అడ్డ గాడిదలకు కూడా వాక్ స్వాతంత్రం ఉన్నట్లేగా??. కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే భయాన్ని చంద్రబాబులో కలిగించిన వ్యక్తి జగన్. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎలా??. అని ఆయన వ్యాఖ్యానించారు.