హైదరాబాదీలకూ ఆ గుడ్ న్యూస్ చెప్పిన మారుతీ సుజుకీ

-

కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా హైదరాబాదీలకి శుభవార్త అందించింది. ఇప్పటి దాకా ఢిల్లీ, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్న వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ని ఇప్పుడు హైదరాబాద్‌, పుణె నగరాలకూ విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ ఢిల్లీ, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ స్కీమ్‌ లో కారును కొనుగోలు చేయకుండానే నేరుగా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతి నెలా సర్వీస్‌ ఛార్జీల కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్‌ అమలు కోసం జపాన్‌ కు చెందిన ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడీ స్కీమ్‌ మన సిటీలో కూడా స్టార్టయ్యింది. హైదరాబాద్‌ లో స్విఫ్ట్‌ ఎల్‌ఎక్స్‌ఐ మోడల్ కి మినిమం మంత్లీ చార్జ్ 15,354 చెల్లించి 12 నెలల నుంచి 48 నెలల వరకు కారును సబ్‌ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్‌ను వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 60 పట్టణాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మారుతీ కంపెనీ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version