మాస్ మహారాజ్ కి ఈ బ్యూటీ యాక్టింగ్ అంటే అంత ఇష్టమా !

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రవితేజ గురించి మనం చెప్పనక్కర్లేదు. రవితేజ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈయన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్టుగా నిలిచాయి. రవితేజ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఈగల్ ,టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం రవితేజ హరిష్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికైనా ఫేవరెట్ దర్శకులు,హీరో ,హీరోయిన్ లు ఉండటం మామూలే.

తాజాగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో ఇలియానా, అనుష్క, త్రిష, శ్రేయ వీరిలో ఎవరు ఇష్టం అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు రవితేజ నాకు అనుష్క అంటే ఇష్టం అని ముఖ్యంగా మీ యాక్టింగ్ ఎంతో ఇష్టం అని చెప్పాడు. వీళ్ళిద్దరూ విక్రమార్కుడు సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇంటర్వ్యూలో అడిగిన హీరోయిన్ల అందరితోనూ రవితేజ ఒక్కో హిట్ సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news