మసాలా వడలు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?

-

ఆదివారం వచ్చింది అంటే ఏదైనా కొత్తగా చేసుకొని తినాలని అనుకుంటారు.చాలా సులువుగా ఏదైనా స్నాక్స్ చేసుకోవాలని అనుకొనేవారికి మసాలా వడ బెస్ట్ ఆప్షన్.. అయితే చాలా మందికి ఈ వడలను చేసుకోవడం సరిగ్గా రాదు.అందుకే బయట బండి మీదవి తింటూ అనారోగ్యానికి గురవుతారు.ఇక ఆలస్యం ఎందుకు కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ మసాలా వడను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

 

కావలసిన పదార్థాలు:

శనగ పప్పు: పావు కిలో,

సన్నగా తరిగిన ఉల్లిపాయ: 2,

సన్నగా తరిగిన పచ్చి మిర్చి : 4,

కరివేపాకు : రెండు రెబ్బలు,

తరిగిన కొత్తిమీర : కొద్దిగా,

చిన్న ముక్కలుగా తరిగిన తోటకూర : అర కప్పు,

జీలకర్ర : అర టీ స్పూన్,

ఉప్పు : రుచికి తగినంత,

గరం మసాలా : అర టీ స్పూన్,

అల్లం వెల్లుల్లి పేస్ట్ : అర టీ స్పూన్,

నూనె :డీప్‌ ఫ్రై కి సరిపడా..

తయారి విధానం:

ముందుగా శనగ పప్పును బాగా కడిగి సరిపడా నీళ్ళు పోసి నాలుగు లేదా ఐదు గంటలు నాన పెట్టుకోవాలి.అవి నానిన తర్వాత వాటిలోంచి నీటిని వంపెసి రెండు మూడు స్పూన్ల పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి.మిగిలిన శనగపప్పును జార్లో వేసి నీళ్లు వేయకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పైన చెప్పిన వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి.పక్కన తీసి పెట్టుకున్న శనగ పప్పును కూడా వేసుకోవాలి. ఆ పిండిని ముద్దలాగా తీసుకొని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో వడ లాగా చేసుకోవాలి. కడాయిలు పెట్టుకొని ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత వడలను కాల్చుకోవాలి..అంతే ఎంతో రుచికరమైన మసాల వడలు రెడీ..టమోటా సాస్ లేదా పుదీన చట్నితో తింటే చాలా రుచిగా ఉంటాయి..

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version