మాస్క్ త‌ప్ప‌నిస‌రి కాదు.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

-

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి ఫేస్ మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ఉన్న నిబంధ‌న‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఎత్తివేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా మ‌హారాష్ట్ర సీఎం కార్యాల‌యం నుంచి కూడా మాస్క్ త‌ప్ప‌నిసరి కాద‌నే ఉత్త‌ర్వులు కూడా జారీ చేశారు. అయితే మ‌హారాష్ట్ర నూత‌న సంవ‌త్స‌రం అయినా.. గుడిప‌డ్వా సంద‌ర్భంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. మాస్క్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

అయితే మాస్క్ ధ‌రించ‌డం అనేది ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం అని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగ ఈ రోజు మ‌హారాష్ట్ర కేబినెట్ స‌మావేశం అయింది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే అధ్య‌క్షత‌న జ‌రిగిన ఈ కేబినెట్ భేటీలో మాస్క్ ధ‌రించ‌డంపై నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ప్ర‌క‌టించారు.

మ‌హారాష్ట్ర తో పాటు దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. అయితే ఇప్ప‌టికే ముంబై మ‌హా న‌గ‌రంలో మాస్క్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version