ఇండియా పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న రష్యా విదేశాంగమంత్రి లావ్రోవ్

-

ఇండియా పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఢిల్లీకి వచ్చారు. అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఏప్రిల్ 1న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌లను కలుస్తారని రష్యా విదే శాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.

ఉక్రెయిన్- రష్యా యుద్ధం జరుగుతన్న సమయంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా పర్యటన తర్వాత ఆయన భారత్ కు వచ్చారు. భారత్ -రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింగా బలపడేలా ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతిపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. దీంతో పాటు భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎస్-400 క్షిపణి రక్షక వ్యవస్థను మరింత త్వరగా ఇండియాకు దిగుమతి చేయాలని రష్యాను కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియాలో బ్రిటీష్​ విదేశాంగ మంత్రి లిజ్​ ట్రస్​, అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దిలీప్​ సింగ్​లు పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఇండియా పర్యటనకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version