రంగారెడ్డిలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో ట్రాలీ కింద పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో శుక్రవారం ఉదయం సంభవించింది.
భవన నిర్మాణంలో ఉన్న సిమెంట్ ఆటో రివర్స్ తిరిగే క్రమంలో బాలిక ప్రమాదవశాత్తు టైర్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంభవించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.