ట‌ర్కీ ఇజ్మీర్‌‌లో భారీ భూకంపం..యజమానుల కోసం మూగ జీవి ఆరాటం.

-

టర్కీపై ప్రకృతి పగబట్టినట్లుంది..మొన్నటి వరకూ కరోనాతో ఇబ్బందులు పడ్డ టర్కీ ఇప్పడు భూకంపాలతో అతలాకుతలం అవుంది..తాజాగా ట‌ర్కీలోని ఇజ్‌మిర్ న‌గ‌రాన్ని భారీ భూకంపం కుదిపేసింది..రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 7గా న‌మోదు అయ్యింది..ఏజియ‌న్ స‌ముద్రం వ‌ద్ద సుమారు 300 సార్లు ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి..గ్రీసులోని సామోస్ దీవుల్లోనూ భూమి కంపించింది..భూకంపం దాటికి బ‌హుళ అంత‌స్తులు నేల‌మ‌ట్టం అయ్యాయి..శిథిలాల కింద వంద‌లాది మంది చిక్కుకున్నారు..ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు..ఇజ్‌మిర్ న‌గ‌రంలో కూలిన ఓ భ‌వ‌నం వ‌ద్ద హృద‌య విదార‌క దృశ్యం చోటు చేసుకుంది.. శిథిలాల కింద చిక్కుకున్న త‌న య‌జ‌మాని కోసం ఓ శున‌కం ఆరాట ప‌డుతోంది.. నోరు లేని ఆ మూగ జీవి య‌జ‌మాని ప్రాణాల‌ కోసం ఆరాట‌ప‌డుతున్న దృశ్యాలు అంద‌ర్నీ క‌లిచివేస్తోంది..ఏజియ‌న్ సముద్ర తీరంలో ఉన్న దీవుల‌కు సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అనేక తీర ప్రాంతాల్లో స‌ముద్ర నీటి మ‌ట్టం పెరిగింది..ఇజ్మీర్‌ తీర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది..భారీ భవనాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news