జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో…

-

తెలంగాణపై వ‌రుణుడి ప్ర‌తాపం కొన‌సాగుతోంది. ఏకధాటిగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం.. ప్రజలను జడిపిస్తోంది. ముంపు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల పల్లెల మధ్య రాకపోకలు స్తంభించ‌గా, రహదారులు కొట్టుకుపోయాయి.. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో శనివారం నాటికి 106.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వ‌ర‌ద నీటితో ప్రాజెక్టుల‌న్నీ నిండు కుండ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి.

ఎగువ కురుస్తున్న కుండపోత వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం.. దాదాపు 4.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి 4,17,770 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 1045 అడుగులు (9.657 టీఎంసీలు) ప్రస్తుతం 1044 అడుగులు (8.730 టీఎంసీలు)గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news