కాసేపట్లో జేఈఈ అడ్వాన్స్డ్ .. నిమిషం ఆలస్యమయినా నో ఎంట్రీ !

-

కాసేపట్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు సుమారు లక్షా 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ పరీక్ష జరుగుతోంది. కరోనా వలన భౌతిక దూరం పాటించేలా పరీక్ష కేంద్రాలు, పరీక్ష జరిగే సిటీలు భారీగా పెంచారు. తెలంగాణా విషయానికి వస్తే హైదరాబాద్ తో పాటు 15 చోట్ల పరీక్ష… ఆదిలాబాద్, హైద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్ నగర్,మెదక్, నల్గొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ పరీక్ష రెండు పేపర్ ల ద్వారా జరగనుంది. ఉదయం 9 నుండి 12 వరకు మొదటి పేపర్… మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు సెకండ్ పేపర్ ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ ఉండకుండా పరీక్ష కేంద్రాలకు ఏ టైం కు చేరుకోవాలో విద్యార్థులకు టైమ్ స్లాట్ కేటాయిస్తూ ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నారు అధికారులు. విద్యార్థులు మాస్క్ లు ధరించి రావాలి.. సానిటైజర్, వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. కోవిడ్ పై సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని, సెకండ్ పేపర్ స్టార్ట్ కాగానే విద్యార్థులు అడ్మిట్ కార్డు ఇన్విజిలేటర్ కి ఇచ్చేయాలని అధికారులు చెబుతున్నారు. మళ్ళీ దాన్నీ వెనక్కి తెచ్చుకోకూడదని అంటున్నారు. ఇక అడ్మిట్ కార్డ్ తో పాటు గుర్తింపు పొందిన కార్డు తెచ్చుకోవాలని అంటున్నారు. అలానే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ అని చెబుతున్నారు. విద్యార్థుల అడ్మిట్ కార్డ్ స్కాన్ చేసి పరీక్ష కేంద్రం సిబ్బంది ఏ రూమ్ కేటాయించారో చెప్పనున్నారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 5 న విడుదల కానున్నాయి. అక్టోబర్ 6 నుండి ఐఐటీ ల్లో సీట్ల కేటాయింపు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news