తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. తెలంగాణలో భారీగా కలెక్టర్లను బదిలీలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే, తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు కానున్నాయి. ఈ మేరకు కసరత్తు పూర్తి చేశారు సీఎం కెసిఆర్.
ఐఏఎస్ ల బదిలీలపై ఏ క్షణం ఐనా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా కాలం తర్వాత ఐఏఎస్ ల బదిలీలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోవాలి. నాలుగేళ్లుగా ఒకే పోస్టులో కొందరు ఐఏఎస్ లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. మెజారిటీ జిల్లా కలెక్టర్లను బదిలీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎన్నికలకు ఏడాది ముందు కెసిఆర్ పాలన ప్రక్షాళన చేస్తున్నారు. ఇక బదిలీల తర్వాత కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.