BREAKING : భద్రాద్రి లో కలకలం.. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం. చర్ల శబరి ఏరియా కమిటీ ఏరియా కార్యదర్శి అరుణక్క పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టులు. ఏప్రిల్ 6న భద్రాద్రి జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ మండల పోలీసులతో మావోయిస్టులుగా పనిచేస్తున్న 16 కుటుంబాల వారిని పిలిచి వారి కుటుంబ సభ్యులను సరెండర్ చేస్తామని కౌన్సిలింగ్ ఇచ్చారని లేఖలో రాసిన మావోయిస్టులు…లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అనేక సదుపాయాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పారని లేఖలో పేర్కొన్నారు.

వారికి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి పోలీసు ఇన్ ఫార్మర్లుగా తయారు చేస్తున్నారని, వారి చావులకు కారణం అవుతున్నారని తెలిపారు. అనేకమంది విద్యార్థులకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వక ఎన్ని కార్యకలాయాలు చుట్టు తిరిగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు… మావోయిస్టుల కుటుంబ సభ్యులను మాయమాటలు చెప్పి పక్కదోవ పట్టిస్తూ అటవీ సంపదను దోచి సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్లకు అప్పగించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని లేఖలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version