తెరాసకు వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రాలు?

-

తెరాస అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మావోయిస్టులు కరపత్రాలు ప్రచురించారు. శుక్రవారం తెల్లవారు జామున జయశంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సివిల్ సప్లై గోడౌన్ వద్ద మావోయిస్టుల పేరుతో వెలువడిన కరపత్రాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బూటకపు ముందస్తు అసెంబ్లి ఎన్నికలను బహిష్కరించి, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడండి, ప్రభుత్వంలోని దోపిడి అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాడండీ,… అంటూ తెలుగులో రాసిన లేఖతో తెలంగాణలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మావోయిస్టులకు తెలంగాణలో ఎలాంటి అవకాశం లేదంటూ ఇటీవలే డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి మావోయిస్టులు  ఎలాంటి ఘాతుకానికి పాల్పడతారో అంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత నెలలో విశాఖ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారంటూ హత్య చేసిన విషయం మనకు తెలసిందే..దీనికి సంబంధించి వారు వివరణకూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news