వింత: ఎప్పుడైనా ఇలాంటి విల్లాని చూసారా….?

-

సాధారణంగా మనం మామూలు విల్లాల్ని చూసి ఉంటాం. కానీ కదిలే ఈ విల్లాని చూసి ఉండం. నిజంగా దీనిని చూశారంటే షాక్ అవ్వాల్సిందే…! ఎందుకంటే ఈ విల్లా చాలా వింతగా ఉంది చూడడానికి. ఇది కేవలం డబల్ డెక్కర్ బస్సు లాగ కనిపించ వచ్చు. కానీ అది డబల్ డెక్కర్ బస్సు కాదండి. సకల సదుపాయాలను అందించే విల్లా.

దీనిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. పైగా ఇది తెగ వైరల్ అయిపోతోంది. మామూలుగా మనం స్థలం కొనుక్కుని రెండు అంతస్తుల బంగ్లా కట్టుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. దాని కోసం అంత శ్రమ, డబ్బులు అక్కర్లేదు. కేవలం ఇలాంటి కారు ఒకటి కొనుక్కుంటే చాలు. ప్రయాణానికి వాహనంగా ఉంటుంది. పైగా దానిని ఆపేస్తే విల్లాగా ఉపయోగ పడుతుంది.

దీనిలో ఉన్న విచిత్రమేమిటంటే ఈ కారుని మనం పార్క్ చేసి… తర్వాత ఒక బటన్ ని ప్రెస్ చేసి ఉంచితే చాలు. అది రెండంతస్తుల విల్లాలా క్షణాల్లో మారిపోతుంది. పైగా ఇందులో మరో విచిత్రం ఏమిటో తెలుసా…? రెండో అంతస్తు లోకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి ఉంటుంది. పెద్దగా విశాలమైన బెడ్ ఉంటుంది. అంతే కాదండి కిచెన్, బాల్కనీ వంటి వసతులు కూడా మనకి దీని ద్వారా లభిస్తాయి. మాక్సస్‌ వి90 లైఫ్‌ హోమ్‌ విల్లా ఎడిషన్‌ పేరు తో రూపొందించిన ఈ కారు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో అందుబాటు లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version