ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ అమ్మవారులను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.దీంతో మేడారం జాతరకు వచ్చే భక్తుల వీక్నెస్ ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.జాతరలో వివిధ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాటర్ క్యాన్ నుంచి కూల్ డ్రింక్ ధరలు భారీగా పెంచేశారు. సరఫరా కష్టంగా ఉండటంతో ధరలు పెంచేసి అమ్ముతున్నామని వ్యాపారులు చెబుతున్నారు.
20 లీటర్ల వాటర్ క్యాన్ ధర రూ.150 పలుకుతున్నట్లు భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో బీరు రూ.280-300కు విక్రయిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. అవసరాన్ని ఆసరాగా చేసుకుని మొబైల్ ఛార్జింగ్ గంటకు రూ.50-70 వసూలు చేస్తున్నారని భక్తులు పేర్కొన్నారు.ఇక ఇప్పటికే ఈ జాతరకు సుమారు 1.35 కోట్ల మంది వచ్చినారని మంత్రి సీతక్క తెలిపారు. ‘ఆర్టీసీ 6వేల ప్రత్యేక బస్సులతో 12వేల ట్రిప్పులు నడిపింది అని పేర్కొన్నారు.