కానుకలు, విశిష్టతలు తెలిపేలా మేడారం జాతర ఇన్విటేషన్.. చూశారా..?

-

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు అంతా రంగం సిద్ధమ‌వుతోంది దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. `సమ్మక్క-సారలమ్మ జాతర`. ఇక మరో వారం రోజుల్లో మొదలయ్యే ఈ జాతరకు ప్రముఖులను ఆహ్వానించేందుకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తయారు చేయించిన ఆహ్వాన పత్రిక అద్భుతమనిపిస్తోంది. దీన్ని చూసిన వారంతా అధికారుల వినూత్న ఆలోచనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

జాతర చరిత్ర, గిరిజనుల సంప్రదాయాలను తెలిపేలా దీన్ని తయారు చేశారు. ఆహ్వానితులకు బహుమతిగా, గిరిజనులు చిత్రించిన ఓ బొమ్మ, గుర్రం తల (లక్ష్మీ దేవరగా నమ్మే చెక్క బొమ్మ), భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కర్రతో తయారు చేసిన కుంకుమ భరిణ (ఇందులో అమ్మవార్ల పసుపు కుంకుమలను నింపి..) జాతర విశేషాలను తెలిపేలా తయారు చేసిన టేబుల్ బుక్ లను కానుకలుగా ఉంచారు. ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఆహ్వాన పత్రాలను తయారు చేయించినట్టు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతీ రాథోడ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version