ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్,’నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణీ మేధా పాట్కర్ ఒక్కసారిగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. నగరంలోని చాదర్‌ఘాట్‌లోని ఓ నివాసానికి ఆమె విచ్చేశారు. సమాచారం అందుకున్న సిటీ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమె వద్దకు చేరుకున్నారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పరిశీలించేందుకు ఆమె వచ్చారని రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించివేసినట్లు తెలిసింది. కాగా, తన స్నేహితులను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం.ఆమె చెప్పే విషయాలను పోలీసులు పట్టించుకోలేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మేధా పాట్కర్‌కు సూచించినట్లు తెలిసింది.