తెలంగాణలో మరో విషాదం..మెడికల్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్య

-

తెలంగాణలో మరో విషాదం..మెడికల్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్య చేసుకుంది. కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్ధి సైఫ్ వేధింపులకు పాల్పడటం, వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని వేదిస్తూ తోటి విద్యార్ధులతో కలిసి పోస్టులు పెట్టడం చేశాడు. దీంతో ఆత్మహత్యయత్నం చేశారు.

ఆత్మహత్య చేసుకునేందుకు ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే, ఈ సంఘటన మరువక ముందే, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మెడికో, ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్య చేసుకుంది. ఏ కారణంగా విద్యార్థి మృతి చెందిందో తెలియరాలేదు. కానీ మెడికల్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version