సహజంగా వెంట్రుకలు రాలిపోయి బట్టతలగా మారుతుంటే ఏ వ్యక్తికైనా ఆందోళన, బెంగ సహజమే. అందులోనూ యుక్త వయస్సు పురుషులకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. పూర్వం 40 సంవత్సరాల వయసు దాటాక వచ్చే బట్టతల ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే మొదలవుతుంది. జన్యుసంబంధ కారణాల వల్ల లేదంటే ఒత్తిడి వల్ల ఈ బట్టతల వస్తుంది. బట్టతల వల్ల కొంతమందికి పెళ్లిళ్లు కూడా కావడం లేదు.
ఇలా ఎన్నో సమస్యలతో మగవారు ఇబ్బందులు పడతారు. కానీ గతంలో కంటే ఇప్పుడు దీనికి చికిత్సలు ఉన్నాయి. కొందరు ఈ బట్టతలకు శస్త్రచికిత్స చేయించుకొని జుట్టును అతికించుకుంటున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఏ చిన్న తప్పు జరిగిన కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే బట్టతలకు చెక్ పెట్టేందుకు చెన్నైకి చెందిన దేబబ్రత ఆరో ఫౌండేషన్ ఓ ఇంజక్షన్‌ను కనిపెట్టింది.
ఈ ఇంజక్షన్ కోసం ఎన్నో పరిశోధనలు జరిపి విజయవంతం అయింది. ఈ ఇంజక్షన్ పేరు ‘క్యూఆర్ 678’. దీనిపై ఎన్నో పరీక్షలు జరిపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మరియు ఇప్పటికే చాలా మందిపై ఈ ఇంజక్షన్ ప్రయోగించడంతో సక్సెస్ అయ్యారు.
ఈ ఒక్కో ఇంజక్షన్ ధర రూ. 6,000. దీన్ని మూడు వారాలకు ఒకసారి చప్పున ఎనిమిది ఇంజక్షన్‌లు చేయించుకుంటే జుట్టు మళ్లీ వస్తుంది. ఈ ఎనిమిది ఇంజక్షన్స్‌కు 48,000 ఖర్చు చేస్తే బట్టతలతో బాధపడేవారు తిరిగి తమ జుట్టును పొందవచ్చు.