బిగ్‌బాస్‌పై లేడీ కంటెస్టెంట్ తీవ్ర ఆరోప‌ణ‌లు…. డ‌బ్బులు ఎగ్గొట్టారు..

-

ప్ర‌స్తుతం ఇండియ‌న్ బుల్లితెర‌ను ఓ ఊపు ఊపుతోన్న వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై కొన్ని చోట్ల తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలుగులో శ్వేతారెడ్డి లాంటి వాళ్లు ఇప్ప‌టికే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇక త‌మిళ బిగ్‌బాస్ సైతం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తమిళ బిగ్‌బాస్-3పై నటి మీరా మిథున్ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి నెల రోజులు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె ఆరోపించింది.

త‌న‌కు రావాల్సిన మొత్తంపై తాను నిర్వాహ‌కుల‌ను అమౌంట్ అడిగినా స‌రైన రెస్పాన్స్ లేద‌ని కూడా ఆమె చెప్పింది. బిగ్‌బాస్ నిర్వాహ‌కులు త‌న ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేద‌ని.. తాను నేరుగా వెళ్లి త‌న‌కు రావాల్సిన అమౌంట్ గురించి అడిగినా స్పందించ‌డం లేద‌ని కూడా ఫైర్ అయ్యింది. అలాగే త‌న‌కు రావాల్సిన అమౌంట్ అడిగినందుకు క‌క్ష‌క‌ట్టి త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా ఆమె ధ్వ‌జ‌మెత్తింది.

త‌న‌పై జ‌రిగిన త‌ప్పుడు ప్ర‌చారం నేప‌థ్యంలో త‌న‌కు కోటి రూపాయ‌లు ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేయ‌డం విశేషం. ఇటీవల తాను అందాల పోటీలు నిర్వహించినప్పుడు పోలీసులు అడ్డుకుని ఫైనల్స్ జరగకుండా ఆపేశారని ఆరోపించింది. ఈ క్ర‌మంలోనే ఆమె తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. అది ఏ పార్టీ నుంచి అనేది త్వ‌ర‌లో చెపుతాన‌ని కూడా పెద్ద బాంబు పేల్చింది.

ఇక త‌మిళ బిగ్‌బాస్‌పై ఇప్ప‌టికే హాస్యనటి మధుమిత కూడా విజయ్ టీవీపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పారితోషికం ఇవ్వలేదని ఆమె చెప్ప‌గా ఇప్పుడు మీరా సైతం షోపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డంతో అక్క‌డ బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version