మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ వాయిదా పడింది. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. గ్రాఫిక్స్ అలాగే వి ఎఫ్ ఎక్స్ జాప్యం కారణంగా చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ తేదీని వాయిదా వేశారు.

అయితే దీనిపై విమర్శలు రాకుండా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ద్వారానే ఈ విషయాన్ని చెప్పిస్తూ వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని.. చిన్నపిల్లలకు బాగా నచ్చే సినిమా అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ వీడియోలో పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను ఇవాళ రిలీజ్ చేయబోతున్నట్లు చిరంజీవి వెల్లడించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా రేపు చిరంజీవి పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే.