కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కి ఊహిం చని ఎదురు దెబ్బ తగిలింది. ఆమెకు ఓ అజ్ఞాత వ్యక్తి బహిరంగ లేఖ రాశాడు. డబ్బులు ఇవ్వాలి లేకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. సరిగ్గా ఆగస్టు 17 అంటే నాలుగు రోజుల కిందట.. ముఖానికి మాస్క్ వేసుకొని… నెల్లూరులోని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చాడట.

అయితే ఆ లేఖను… వేమిరెడ్డి కుటుంబ సభ్యులకు అందించారు భద్రత సిబ్బంది. అయితే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనకు రెండు కోట్ల ఇవ్వాలని… ఆ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇస్తూ లేఖ రాశాడు. అయితే దీనిపై ఆరా తీసి.. చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుటుంబ సభ్యులు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.