ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఈ మధ్య 5-10 సంవత్సరాలనుంచి విపరీతంగా పెరుగుతుంది. చిన్నవయసు పిల్లల నుంచి పెద్దవయసు వారి వరకు ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వచ్చిన వారికి జీవితకాలం స్టిరాయిడ్స్ వాడుతుంటారు. మన శరీరంలో రక్షణ వ్యవస్థే మన శరీరం అవయువాల మీద దాడి చేసి మన శరీరం అవయువాలను సహజంగా పని చేసుకోనివ్వకుండా రోగగ్రస్థంగా మార్చేస్తాయి. మన కణజాలాన్ని డామేజ్ చేస్తాయి. అంటే శత్రువుల మీద దాడిచేయాల్సిన వారు..మిత్రులు మీద దాడి చేసినట్లు. ఈ రకరమైన ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల రొమటైడ్ ఆర్థరైటీస్, అల్సరేటీవ్ కొలిటీస్, ఎస్ ఎల్ఈ, యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ సమస్యలు లాంటివి వస్తాయి. మరి ఈ సమస్య తగ్గించుకోవాలన్నా, లేని వారికి రాకుండా ఉండాలన్నా నందివర్థన పువ్వులు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు.
2021లో కింగ్ సాద్ యూనివర్శిటీ- సౌదీ అరేబియా( king Saud University- Saudi Arabia) వారు ఎలుకలపైన పరిశోధన చేసి..ఈ నందివర్థన పువ్వుల కషాయం వాడుకున్నప్పుడు మనకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కలిగించడానికి కారణం అయిన IL6, TNLF ఆల్ఫాను ఈ నందివర్థన పువ్వుల్లో ఉండే ఔషధగుణాలు నాశనం చేసి..ఈ డిసార్డర్ రాకుండా చేస్తాయని, వచ్చినవారు దానినుంచి బయటపడడానికి బాగా పనికొస్తుందని వాళ్లు ఇవ్వటం జరిగింది.
ఈ పువ్వులు ఎలా ఉపయోగించాలంటే..
నందివర్థన పువ్వులు రేకులను తీసి సుమారుగా 18 గ్రాములు తీసుకోండి. 10ml వాటర్ కు 5రేకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత వడకొట్టి అందులో తేనె, కావలంటే నిమ్మరసం కూడా కలుపుకుని తాగొచ్చు. ఇలా తాగితే..ఆ పువ్వులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఈ డీసార్డర్స్ కు కారణమయ్యే వాటిని నాశనం చేస్తాయట.
ఈరోజుల్లో చిన్న వయసునుంచే ఈ ఈటో ఇమ్యూన్ డిసార్డర్ సమస్య ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కాబట్టి పూజకు ఉపయోగించే ఈ తెల్లటి నందివర్థనపువ్వులతో ఇలా చేసుకుని తాగొచ్చు.
ముఖ్యమైన విషయం..ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పువ్వుల రేకులను పచ్చిగా వాడకూడదు. ఎందుకంటే ఆ పాలల్లో హాని కలిగించేవి ఉంటాయి.
మన శరీరంలో విడుదలయ్యే రెండు ఫ్రీ రాడికల్స్ సూపర్ ఆక్సైడ్, హైడ్రాక్సిల్ అనే ఫ్రీ రాడికల్స్ ను ఈ కషాయం నాశనం చేస్తుంది.
ఈ కషాయంలో ముఖ్యంగా ఉన్న కెమికల్స్ ట్రైటర్పినాయిడ్స్( triterpendoids), ఫినాల్స్( Phenols ఈ ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసి..దీని ద్వారా మన శరీరంలో కణజాలంలో ఉండే RNA, DNA నుంచి రక్షించడానికి బాగా ఉపయోగపడుతుందని 2011వ సంవత్సరంలో పలావన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ- కాంచీపురం తమిళనాడు( Palavan College Of Pharamacy- Kanchipuram, Tamilanadu)వాళ్లు పరిశోధన చేసి నిరూపించారు.
నందివర్థన పువ్వులను పేస్ట్ చేసి..స్కిన్ ఇన్ఫక్షన్స్ అయినప్పుడు రాస్తే..స్కిన్ బాగా హీల్ అవడానికి, స్మూత్ అవడానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు.
నందివర్థన పువ్వులు కోసినప్పుడు పాలు కారుతాయి కదా..ఆ పాలను యూండ్స్, దెబ్బలు ఉంటే..దానిమీద అప్లైయ్ చేస్తే..నొప్పి తగ్గుతుందట. శరీరంపైను ఇలాంటి దెబ్బలకు ఈ పాలను వాడొచ్చుకానీ. కడపులోపలికి మాత్రం తీసుకోకూడదు.
నందివర్థన పువ్వులో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి..ఎవరికైతే..ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు..వాడొచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు తెలిపారు.
-Triveni Buskarowthu