‘అదిరింది’ రేటింగ్స్ చూసి బెదిరిపోయిన నాగబాబు…..!!

-

ఇటీవల ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో నుండి హఠాత్తుగా బయటకు వచ్చిన ఆ షో జడ్జిల్లో ఒకరైన నాగబాబు, ఆ షో నిర్వాహక సంస్థైన మల్లెమాలలో కొందరి ప్రవర్తన తనకు నచ్చకపోవడం వల్లనే షో నుండి బయటకు వస్తున్నానని, అయితే తనకు ఆ షో నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థ ఎండి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీద గాని, లేదా ఈటివి యాజమాన్యం మీద గాని ఎటువంటి నెగటివ్ అభిప్రాయం లేదని అన్నారు. ఇకపోతే ఆ తరువాత జీ తెలుగులో ప్రసారం అయ్యే అదిరింది అనే షోలో జడ్జిగా సరికొత్త అవతారం ఎత్తిన నాగబాబు,

తనతో తో పాటు ఆ షోలోకి చమ్మక్ చంద్రను తీసుకువెళ్లడం జరిగింది. కొన్నాళ్ల క్రితం మంచి జోష్ తో మొదలయిన ఈ షో తప్పకుండా జబర్దస్త్ కు పోటీ ఇస్తుందని సదరు ఛానల్ వారు, అలానే నాగబాబు కూడా భావించారు. అయితే నేడు కొన్ని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఇటీవల విడుదలైన రేటింగ్స్ ని బట్టి చూస్తే, అదిరింది షో కనీసం జబర్దస్త్ షో దరిదాపుల్లోకి కూడా అదిరింది షో చేరలేకపోయినట్లు చెప్తున్నారు. ఇక ఇటీవల వచ్చిన రేటింగ్స్ ని బట్టి చూస్తే, జబర్దస్త్ కు 5 నుండి 6 రేటింగ్స్ రాగా, అదిరిందికి కేవలం 0.5 రేటింగ్స్ మాత్రమే దక్కాయని,

 

ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నాగబాబు నిర్మించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ఆరంజ్ మాదిరిగా ఈ షో కూడా ఆయనను బెదరగొట్టిందని కొందరు నెటిజన్లు సోష మీడియా మాధ్యమాల్లో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చిన తరువాత ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని చాలా మంది భావించారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కు వస్తున్న భారీ రేటింగ్స్ ని బట్టి చూస్తుంటే, ఆ షోలో మంచి స్కిట్స్ ప్రదర్శిస్తున్న పార్టిసిపెంట్స్ కు ఉన్న ఆదరణే ఇంకా షోను మంచి స్థాయిలో ముందుకు నడిపిస్తుందని అంటున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version