ఎయిర్ పోడ్ మింగేసాడు, డాక్టర్లు ఎం చెప్పారంటే…

-

చిన్న పిల్లలు చేసే చేష్టలు అన్నీ ఇన్ని కాదు. ఏది దొరికినా సరే ముందు వాళ్ళ చేయి నోటి వద్దకే వెళ్తుంది. చిన్న పేపర్ ముక్క కనపడినా, రాయి కనపడినా, మట్టి కనపడినా, ఏదైనా వస్తువు కనపడినా సరే నోట్లో పెట్టుకోవడానికే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే తల్లి తండ్రులు పిల్లల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వస్తువులు మినహా చిన్నవి ఉంచే సాహసం చేయరు.

ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదొకటి చేస్తూనే ఉంటారు. తాజాగా ఒక బాలుడు క్రిస్మస్ గిఫ్ట్‌గా వచ్చిన ఎయిర్‌పాడ్‌ను అమెరికాలోని అట్లాంటాలో ఏడు సంవత్సరాల బాలుడు అనుకోకుండా మింగేశాడు. ఇది గమనించిన తల్లి తండ్రులు వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకువెళ్లి డాక్టర్లకు చూపించారు, వాళ్ళు ఎక్స్‌రే తీయగా, ఎయిర్‌పాడ్‌ కడుపులో ఎటు కదలకుండా ఉండటంతో,

పాటూ చెక్కుచెదరకుండా ఉందని గుర్తించారు. దాన్ని మనం బయటకు తీయలేమని మలంతో పాటుగా అదే బయటకు దానంతట అదే వస్తుందని చెప్పారు. డాక్టర్లు చెప్పింది విని, బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మింగిన తర్వాత తర్వాత ఆ బాలుడు ఏ విధమైన అనారోగ్యానికి గురికాకపోవడం ఇంటికి పంపించేసారు. దీనితో ఆ తల్లి తండ్రులు అది ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version