వైరల్ వీడియో, టిఆర్ఎస్ ఎమ్మెల్యే గారి విన్యాసం చూడండి…!

-

కంచర్ల భూపాల్ రెడ్డి గుర్తున్నారా…? అదేనండి 2018 తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించడం ద్వారా సంచలనం సృష్టించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామానికి చెందిన ఆయన తన తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భూపాల్ రెడ్డి ఆ పార్టీలో కొంత కాలం ఉన్న తర్వాత,

ఆ పార్టీకి తెలంగాణాలో భవిష్యత్తు లేదని గ్రహించి టిఆర్ఎస్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా వచ్చింది. 2018 చివర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన జీవితంలో ఒక విషాద సంఘటన ఉంది. చిన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయన చేతికి ప్రమాదం జరిగితే వైద్యుల నిర్వాకం తో ఆయన చేతిని తొలగించారు. అప్పటి నుంచి ఆయన ఒక్క చేత్తోనే ఉన్నారు.

తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. రెండు టెన్నిస్ క్రికెట్ బంతులను ఆయన తన ఒంటి చేత్తో గాల్లోకి విసురుతూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక అందమైన ఫీట్ చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిక్ టాక్ లో ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొట్టేస్తుంది. ఒక పాటను కూడా ఆ వీడియోకి జత చేసి గణేష్ అనే వ్యక్తి టిక్ టాక్ లో షేర్ చేసారు. మీరు చూసేయండి ఆ వీడియో.

Read more RELATED
Recommended to you

Exit mobile version