కొండా సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

-

సినీ రంగంలో పలువురిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.‘వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి’ అని చిరు ట్వీట్ చేశారు.

ఇదిలాఉండగా సమంత, నాగచైతన్య విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కారణమని మంత్రి కొండా సురేఖ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా సినిమా వాళ్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడని, ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపించాలని కేటీఆర్ కోరగా.. నాగార్జున తన కోడలిని ఫోర్స్ చేశారని అందుకే ఆమె తన మాజీ భర్త చైతూతో విడాకులు తీసుకుందని ఆరోపించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై సమంత, చైతూ, నాగార్జునతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మంత్రి మీద సీరియస్ అయ్యారు. కేటీఆర్ మంత్రి మీద పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news