BRS లోకి మెగాస్టార్ చిరంజీవి ?

-

దసరా పండుగ వేళ దేశ రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలైంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి BRS గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఇది ఇదిలా ఉండగా, తెలంగాణలో అధికార పార్టీ అయినా టిఆర్ఎస్ లో చిరంజీవి చేరనున్నారా అనే వార్తలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకు మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది. కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి శనివారం మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఆవైర్ నెస్ ప్రోగ్రాం ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవిని మంత్రి మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. మెగాస్టార్ ను సోదరుడు, అన్నయ్య అంటూ సంబోధించిన మంత్రి మల్లారెడ్డి తాను, చిరంజీవి ఇద్దరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమని చెప్పుకొచ్చారు. జీవితంలో అన్నిటినీ అనుభవించామని ఇక ప్రజాసేవ ఒక్కటే మిగిలిందని అన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్న క్రమంలో ఆయనకు అండగా నిలవాలంటూ చిరంజీవికి సూచించారు. అంటే ప్రజాసేవ చేసేందుకు గాను చిరంజీవి బిఆర్ఎస్ లో చేరాలని మంత్రి మల్లారెడ్డి పరోక్షంగా ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version