ఈ నెల 12న తెలంగాణకు మోడీ..కేసీఆర్‌ సంచలన నిర్ణయం !

-

తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. నవంబర్ 12వ తేదీన తెలంగాణకు రానున్న మోదీ పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. గతంలో మూతపడిన రామగుండం ఎఫ్ సి ఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. రూ.6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది.

కాగా గతేడాది మార్చి 22న ఆర్ ఎఫ్ సి ఎల్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింగల్ కేంద్ర ఎరువుల శాఖ అధికారులు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ రామగుండం పోలీసులు కమిషనర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టిపిసి టౌన్షిప్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే.. తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఏదో ఒక సాకుతో.. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version