సినిమా, టీవీ షూటింగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వడంపై హీరో చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. వేల మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు. సినిమా, టీవీ షూటింగులకు అనుమతి మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు, విధి విధానాలు రూపొందించి సహకరించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు అంటూ చిరు ట్వీట్ చేశారు.
వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir.@TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2020