పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కమిటయిన సినిమాలన్ని ఫిక్స్ .. వస్తున్నవన్ని రూమర్సే …!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్నతాజా చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ లో సూపర్ హిట్ సాధించున ‘పింక్’ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ లో అజిత్ పోషించిన పాత్రను ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. నివేదా థామస్, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడులైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్ తో పాటు ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దాదాపు 80 శాతం కంప్లీటయిన ఈ సినిమా వాస్తవంగా మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని దిల్ రాజు సన్నాహాలు చేశారు. కాని అనూహ్యంగా సంభవించిన కరోనా కారణంగా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీటవకుండానే బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ ఆగస్టు కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తరువాత చిత్రాల మీద సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని తాజా సమాచారం.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలోను నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూర్య మూవీస్ బ్యానర్ లో ఫేమస్ ప్రొడ్యూసర్ ఏ,ఎం.రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కరోనా విపత్తు తో వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆయన నెక్స్ట్ చేయాల్సిన సినిమాలు ఆగిపోయాయని, పవన్ కళ్యాణ్ డ్రాపయ్యారని రక రకాలుగా వార్తలు సృష్ఠిస్తున్నారు.

అయితే విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కమిటయిన ఏ ప్రాజెక్ట్ కూడా డ్రాపవడం కాని, ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవడం కాని జరగలేదని అంటున్నారు. ఇవన్ని వట్టి పుకార్లేనని చెబుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్, క్రిష్ సినిమాల తర్వాత, హరీష్ శంకర్ సినిమా ఉంటుందట. ఈ సినిమా తర్వాత త్రివిక్రం లేదా డాలి సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తారని పక్కా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version