ఆ ఎమ్మెల్యే అవినీతి వివరాలు అన్నీ నా గుప్పిట్లో ఉన్నాయి: వైసీపీ నాయకుడు ధనుంజయ్ రెడ్డి

-

ఏపీ రాజకీయాలలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఒక కుదుపు అని చెప్పాలి. ఈ ఫలితాల తర్వాత టీడీపీ మరీ రెచ్చిపోయి వచ్చే ఎన్నికల్లో గెలుపు గురించి మాట్లాడే వరకు వచ్చింది. కాగా ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడు అన్న కారణంతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఉదయగిరి వేదికగా వైసీపీ మరియు మేకప్టి వర్గీయుల మధ్యన సవాళ్లు ప్రతిసవాళ్లు వాతావరణం నడిచింది. తాజాగా నెల్లూర్ జిల్లా వైసీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొడవలూరు ధనుంజయ్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే అవినీతి భాగోతం అంతా నా చేతుల్లోనే ఉంది అంటూ సంచలన కామెంట్ చేశాడు.

 

ఈ వివరాలు అన్నీ పూర్తి ఆధారాలతో ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని ఈ సందర్భంగా తెలియచేశాడు. అంతే కాకుండా ధనుంజయ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఉదయగిరిలో గెలిచేది వైసీపీ అని బల్లగుద్ది చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version