అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌కు మరో పాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ భార్య మెలానియాతో ట్రంప్ కి సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను మెలానియా ట్రంప్ మాజీ సహాయకుడు చెప్పినట్టు అమెరికా మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే మెలానియా అతనికి విడాకులు ఇవ్వబోతోందని అందుకు ఆమె సమయం కోసం ఎదురు చూస్తోందని వార్తలు వస్తున్నాయి.
వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ కాలం గడిపేస్తున్నారని ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పినట్టు సమాచారం. 2005 జనవరి 22న ట్రంప్, మెలానియాల పెళ్లి జరిగింది. కాగా ఈమె ట్రంప్ కు మూడవ భార్య. ఈ వార్త ఇప్పుడు అమెరికా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడికి భార్యగా ఉండడం అంటే చాలా గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్ లేడీకి అధ్యక్ష్యుడికి ఉన్నంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ భర్త అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇవ్వాలని అనుకోలేదని చెబుతున్నారు.