అమెరికా ఫస్ట్ లేడీని ఫిదా చేసిన మన పిల్లలు…!

-

అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడు అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వారికి చూపించాల్సిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ కి అయితే మన వంటలు, మన సంప్రాదాయాలు, మన జీవన విధానాలు చూపించడానికి చాలా తపన పడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కి ఢిల్లీ లోని సర్వోదయ స్కూల్ విద్యార్ధులు ఘన స్వాగతం పలికారు.

ఆమె స్కూల్ కి వెళ్ళగానే అక్కడ ఉన్న విద్యార్ధులు కుంకుమ పెట్టి, ఆమెకు హారతి ఇచ్చారు. ఆ హారతి చూసి ఆమె తెగ ముచ్చటపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కూడా అవుతుంది. ఇక ఆ స్కూల్ లో హ్యాపినేస్ విద్యా విధానాన్ని స్వయంగా వీక్షించారు. స్కూల్ పిల్లలతో ఆమె కాసేపు ముచ్చటించడమే కాకుండా వారు చేస్తున్న వ్యాయామాలను స్వయంగా వీక్షించారు ట్రంప్. ఇక అక్కడ విద్యార్ధులు చేసిన సాంప్రదాయ నృత్యాన్ని వీక్షించారు.

పంజాబీ పాటలకు డాన్స్ చేసారు విద్యార్ధులు. ఈ పర్యటనను తన జీవితంలో మరువ లేనని అన్నారు ఆమె. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్ధులను చూసి ఆమె ముచ్చటపడ్డారు. ఇక అక్కడ ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు అందిస్తున్న విద్య గురించి మాట్లాడారు. హ్యాపీనేస విద్యానాం చాలా బాగుంది అన్నారు. తమ దేశంలో కూడా ఇలాంటి విద్యా విధానాలు అమలు చేస్తున్నామని మెలానియా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version