మీరు నేర్చుకున్నది మీకు గుర్తుండాలంటే ఇలా చేయండి….!

-

సాధారణంగా అది చదువు అయినా పని అయినా చాలా మందికి కొన్ని టాపిక్స్ గుర్తుండవు. అదే పనిని లేదా అదే పాఠాన్ని చదివిన, చేస్తున్న మరచిపోవడం సహజం. చాలా మంది మరచిపోతుంటారు. అయితే గుర్తు పెట్టుకోవడం ఎలా…?, ఏ విధంగా ఫాలో అయితే గుర్తుంటాయి..?, సులువుగా గుర్తుంచుకోవడానికి మార్గాలు..? ఇలా ఎన్నో విషయాలు మీకోసం మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా దీని కోసం చూసేయండి. ఇక వివరాల్లోకి వెళితే…. గుర్తుంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన మార్గాలని కనుగొన్నారు నిపుణులు. వారు చెప్పిన విధానాలు ఇవే…

ఇతరులకు నేర్పించడం:

ఎప్పుడైనా సరే మీరు దేనినైనా గుర్తుంచుకోవాలి అనుకుంటే ఎదుటి వాళ్ళకి నేర్పించండి. ఎదుటి వాళ్ళకి నేర్పడం వల్ల మీకు కూడా ఆ అంశం బాగా గుర్తుండి పోతుంది. ఒకవేళ వినడానికి ఎవరూ లేకపోతే ఎవరో ఉన్నట్టు ఊహించుకుని చెప్పేయండి. ఇలా చేయడం వల్ల మీకు అది బాగా గుర్తుండి పోతుంది.

కాసేపు నిద్రపోవడం:

ఎప్పుడైనా ఎక్కువగా చదవాల్సి వస్తే… మీరు ఒకదాని నుంచి మరొకటి దానికి వెళ్లే ముందు మధ్యలో ఉన్న సమయంలో కాసేపు నిద్రపోండి. ఇలా నిద్ర పోవడం వల్ల మీ బ్రెయిన్ మరింత షార్ప్ అవుతుంది. కాబట్టి ఒక షార్ట్ న్యాప్ వేయండి.

విరామం ఇవ్వడం:

సాధారణంగా మనం ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం లేదా చదవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ముందు ఒక టాస్క్ ని కంప్లీట్ చేసి మరో టాస్క్ కి వెళ్లేటప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు విరామం ఇవ్వడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కనుక మీరు ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ కి వెళ్లేటప్పుడు ఇలా చిన్న గ్యాప్ ఇస్తే మైండ్ రిఫ్రెష్ గా ఉంటుంది. కొత్త టాపిక్ ని కూడా సులువుగా నేర్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version