వావ్‌.. సముద్రంలో 100 ఫీట్ల లోతులో మెస్సీ కటౌట్‌

-

ఫుట్‌బాల్ అనేది ఆట మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఇప్పుడు, అందరి దృష్టి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌పై ఉంది. ఈ నేపధ్యంలో లక్షద్వీప్‌కు చెందిన లియోనెల్ మెస్సీ అభిమాని అరేబియా సముద్రంలో అతడి కటౌట్ ను అమర్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కళ్లు దోహాలోని లుసైల్ స్టేడియంపైనే ఉన్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య రాత్రి 8:30 గంటలకు కప్‌ గెలుపు కోసం మ్యాచ్‌ జరుగనున్నది. రెండు జట్ల అభిమానులు తాము అభిమానించే జట్టే జగజ్జేతగా నిలవాలని కోరుకుంటున్నారు. ఒకవైపు ఫ్రెంచ్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపే కోసం చీర్‌ చేస్తుండగా.. మరోవైపు నుంచి అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీని ఉత్తేజపరుస్తున్నారు.

ఇదిలా ఉండగా, కేరళకు చెందిన ఓ వీరాభిమాని సముద్రంలో 100 అడుగుల లోతులో లియోనెల్ మెస్సీ కటౌట్‌ను ఏర్పాటుచేశాడు. మొహమ్మద్ స్వాదిఖ్ అనే ఈ అభిమాని ఈ కటౌట్‌ను పెట్టాడు. ‘అర్జెంటీనా జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంటే మెస్సీ కటౌట్‌ను సముద్రంలో 100 అడుగుల లోతులో ఉంచుతానని చెప్పాను. ఫైనల్‌కు చేరడంతో అలా చేశాను’ అని స్వాదిఖ్‌ చెప్పాడు. ఈ వీరాభిమాని కవరత్తి ద్వీపంలో నివాసిస్తుంటాడు. ఈ అభిమాని అపూర్వరీతిలో మద్దతు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version